: ట్రంప్ దూసుకురావడం వెనుక నన్నెందుకు ఆడిపోసుకుంటున్నారు?: రిపబ్లికన్లను ప్రశ్నించిన ఒబామా


డొనాల్డ్ ట్రంప్... అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలో దిగేందుకు దాదాపు అన్ని అర్హతలూ సాధించిన వ్యక్తి. గత రెండేళ్ల కాలంలో అనూహ్యంగా దూసుకొచ్చిన ట్రంప్, ఆపై తన నోటి దురుసు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా విమర్శల పాలయ్యారు. ఇక ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారవుతున్న సమయంలో రిపబ్లికన్ మద్దతుదారుల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ట్రంప్ ఎదగడం వెనుక ఒబామా హస్తముందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వీటిని ఆయన స్వయంగా ఖండించారు. రిపబ్లికన్ల తరఫున ట్రంప్ ముందంజ వేయడానికి తాను కారణం కాదని, ఆయన స్పష్టం చేశారు. "రిపబ్లికన్లు నన్ను ఆడిపోసుకుంటున్నారు. మీరు అనాల్సింది నన్ను కాదు. మీచే ఎన్నుకోబడి, ట్రంప్ కు మద్దతు పలికిన ప్రజాప్రతినిధులను. నాటకీయంగా వారంతా ట్రంప్ ను ఎన్నుకుంటున్నారు" అని అన్నారు. కాగా, తొలి ఆరు వారాల ప్రాథమిక అభ్యర్థిత్వ పోటీల్లో ట్రంప్ మిగతా పోటీదారులతో పోలిస్తే, అందనంత దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన ముస్లింలు, వలసదారులు, వీసాలు తదితర విషయాల్లో చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి సరైనోడు కాదని పలు దేశాల దౌత్యాధికారులు సైతం అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో, ఇప్పుడు రిపబ్లికన్లు పునరాలోచించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News