: ఎంపీ కవిత వాహనంలో కేసీఆర్ ఇంటికి గోపీనాథ్, గాంధీ


కొద్ది సేపటి క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కలసి కేసీఆర్ ఇంటికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరూ నిజామాబాద్ ఎంపీ కవిత వాహనంలో కేసీఆర్ ఇంటికి వెళ్లడం గమనార్హం. వీరిద్దరూ ఇప్పటికే ఫిరాయింపుదారుల్లో చేరిపోయి టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే, అధికారికంగా మాత్రం ఇంకా గులాబీ కండువా కప్పుకోలేదు. వీరిని కేసీఆర్ స్వయంగా పార్టీలోకి చేర్చుకోనున్నారు. మరికాసేపట్లో ఇద్దరు నేతలకూ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పనున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా తాము పార్టీ మారినట్టు గోపీనాథ్, గాంధీలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News