: చిన్న కంపెనీల ఉద్యోగులకు శుభవార్త... పీఎఫ్ పరిధిలోకి వచ్చే సమయం!


కేవలం 10 నుంచి 20 మంది ఉద్యోగులను కలిగివున్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్న వారికి చల్లటి కబురు అందనుంది. ఇప్పటి వరకూ కనీసం 20 మందికి పైగా ఉద్యోగులను కలిగివున్న కంపెనీలకే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్-భవిష్య నిధి) సదుపాయం ఉండగా, దాన్ని 10 మంది ఉద్యోగులకు తగ్గించే దిశగా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోనుంది. "ఈ ప్రతిపాదనలను కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. సాంఘిక భద్రతను మరింత మంది వేతన జీవులకు దగ్గర చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ నిర్ణయం అమలైతే, అదనంగా 50 లక్షల మందికి పీఎఫ్ సౌకర్యం కలుగుతుంది" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అతి త్వరలో కొత్త నిర్ణయాలను నోటిఫై చేయనున్నట్టు వివరించారు. అంతకన్నా ముందు ప్రతిపాదనలను నోటీసులో పెట్టి రెండు నెలల పాటు కంపెనీలు, ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News