: పచ్చి మిరపకాయలు వాడితే ఎన్ని ప్రయోజనాలో!
మన ఆహారం విషయంలో మిరపకాయలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆహారానికి మరింత ఫ్లేవర్ ను అద్దే మిరపకాయల విషయంలో, ఎండు మిర్చి కన్నా, పచ్చి మిరపను వాడితే మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి మిరప వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివి. * పచ్చి మిరపలో మరింత సులువుగా ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఫైబర్ గుణాలు అధికం. * పచ్చి మిరపలో విటమిన్ ఏ అధికం. దీంతో కళ్లకు వచ్చే రుగ్మతలు దూరం అవుతాయి. చర్మం కూడా కాంతిమంతమవుతుంది. * యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి పలు రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. * విటమిన్ సీ కూడా ఉంటుంది కాబట్టి, ఇతర విటమిన్లను అరాయించుకునే శక్తి పెరుగుతుంది. * శరీరంలోని అనవసర బాక్టీరియాను నాశనం చేసే గుణాలు పచ్చి మిరపలో అధికం. వీటిని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.