: కోర్టులో కేసుండగా, ఇంత దారుణమా?: రేవంత్ రెడ్డి


తమ పార్టీ గుర్తుపై గెలిచి, ఆపై టీఆర్ఎస్ ప్రలోభాల కారణంగా ఆ పార్టీలో చేరిన వారి విషయమై స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఫిరాయింపుదారులపై ఓ వైపు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుండగా, వారిని రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్ఎస్ లో విలీనం చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలు మారినవారిపై అనర్హత వేటు వేయకుండా విలీనం చేసుకోవడం కేసీఆర్ మార్కు రాజకీయమా? అని ప్రశ్నించారు. కాగా, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన 12 మంది తమను విలీనం చేయాలని కోరడంతో నిన్న స్పీకర్ వారి విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News