: తిరుమలలో వెయ్యికాళ్ల మండపానికి బ్రేక్!... హైకోర్టు స్టేతో టెండర్లు నిలిపేసిన టీటీడీ


శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో కొత్తగా నిర్మించతలపెట్టిన వెయ్యికాళ్ల మండపానికి మళ్లీ బ్రేక్ పడింది. తిరుమల పరిధిలోని నారాయణవనం ఉద్యానవనంలో రూ.18 కోట్లతో సువిశాలంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు మొన్నటి టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. నిధులనూ కేటాయించింది. అయితే గతంలో మాదిరిగానే వెంకన్న ఆలయం ఎదురుగానే వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. నారాయణవనంలో వెయ్యికాళ్ల మండపానికి వారు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మండపం నిర్మాణంపై స్టే విధించింది. దీంతో ఇప్పటికే జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ను టీటీడీ ఉపసంహరించుకుంది. కోర్టులో ఈ వ్యవహారం తేలేదాకా వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి ముందడుగు పడేలా లేదు.

  • Loading...

More Telugu News