: పేద మహిళలకు ఉచిత వంట గ్యాస్: కేబినెట్ ఆమోదం


గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు వంట గ్యాస్ సదుపాయాన్ని కల్పించే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన 'ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన'కు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది. దీని ప్రకారం మహిళలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తారు. 2016-17 సంవత్సరంలో 1.5 కోట్ల మందికి గ్యాస్ సరఫరాను చేసేందుకు రూ. 2 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మందికి ప్రయోజనం కలిగించాలన్నదే తమ ఉద్దేశమని జైట్లీ ప్రకటించారు. కాగా, ఇండియాలో కట్టెల పొయ్యిలు, దాన్నుంచి వస్తున్న పొగ కారణంగా రుగ్మతల పాలై ఏటా 5 లక్షల మంది మహిళలు మృత్యువాత పడుతున్నారని వెల్లడించిన చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఈ స్కీముతో పేదలకు మేలు కలగడంతో పాటు, పర్యావరణానికి కలుగుతున్న హాని తగ్గుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News