: సురేశ్ రైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!


టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా... టీ20 ఫార్మాట్ లో అత్యంత విలువైన ఆటగాడు. తనదైన రోజున అతడు ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. ఒక్క టీ20 ఫార్మాట్ లోనే కాక వన్డేల్లోనూ అతడు ఆల్ రౌండర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలినాళ్లలో రైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అయితే, సోదరుడిచ్చిన మానసిక బలంతో ఆత్మహత్య చేసుకోవాలన్న భావన నుంచి రైనా బయటపడ్డాడు. ఈ మేరకు ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చిన్నతనంలో 13 ఏళ్ల వయసులో ఉన్న రైనా ఓ స్పోర్ట్స్ హాస్టల్ చేరాడు. ఈ క్రమంలో ఒకానొక రోజు రైలులో ప్రయాణిస్తున్న సందర్భంగా తన తోటి క్రీడాకారుడు నిద్రిస్తున్న తనపై కూర్చుని ముఖంపై మూత్రం పోశాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన రైనా... ఎలాగోలా తనపై కూర్చున్న బాలుడిని పక్కకు తోసేశాడు. ఇక హాస్టల్ లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన రైనా బుర్రలో ఆత్మహత్య భావనలు తరచూ వచ్చాయి. ఈ క్రమంలో హాస్టల్ లో ఉండలేనంటూ రైనా ఏకంగా ఇంటికెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత సోదరుడు ఇచ్చిన మనోధైర్యంతో తిరిగి హాస్టల్ లో చేరిన రైనా, ఈ సారి ఇక వెనుదిరిగి చూడలేదు.

  • Loading...

More Telugu News