: సుప్రీం గడప తొక్కిన రోజా... వైసీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ పై నేడు విచారణ


ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట లభించలేదు. దీంతో తాజాగా ఆమె సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News