: టీఆర్ఎస్ అనుబంధ సభ్యులు వీరే!
టీ-టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఆ సభ్యులు వీరే... తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, వివేకానంద, రాజేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఒక బులెటిన్ విడుదల చేశారు.