: స్పీకర్ నిర్ణయం తప్పు...చట్ట ఉల్లంఘన!: టీడీపీ నేత రేవంత్ రెడ్డి


టీటీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తాము న్యాయపోరాటానికి దిగుతామని చెప్పారు. టీఎస్- స్పీకర్ నిర్ణయం చట్ట ఉల్లంఘన అవుతుందని, టీడీపీ ఎమ్మెల్యేల విలీనం అనేది స్పీకర్ పరిధిలో లేదని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న నిర్ణయాన్ని స్పీకర్ ఏ విధంగా తీసుకుంటారని.. ఇది నూటికి నూరుపాళ్లు తప్పని అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కొట్టివేస్తారని, గతంలో ఇలాంటి అంశాలపై కోర్టు తీర్పులు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News