: కాసేపట్లో కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో ఢిల్లీలో కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ఉమా భారతితో ఆయన భేటీ కానున్నారు. అనంతరం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి రెండు గంటలకు ఆయన బయలుదేరతారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది.