: టీ20ల్లో ఆడేందుకు పాక్ కు అనుమతి... ఇండియాకు పయనమవుతున్న ఆటగాళ్లు
టీ20ల్లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) నుంచి అనుమతి లభించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా నిర్వహించే మ్యాచ్ కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో స్వల్ప వ్యవధిలో మ్యాచ్ వేదికను కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు మార్చి బీసీసీఐ, ఐసీసీ ఆటగాళ్ల భద్రతపై చిత్తశుద్ధిని ప్రదర్శించాయి. దీంతో, బీసీసీఐపై భరోసా వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నేటి రాత్రికి పాకిస్థాన్ ఆటగాళ్లు ఇండియాకు బయలుదేరుతున్నారు.