: వెనక్కు తగ్గిన ముద్రగడ... రేపటి దీక్ష వాయిదా
కాపులకు తక్షణ రిజర్వేషన్లు కోరుతూ రేపటి నుంచి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా, దీక్షను వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ముద్రగడ మీడియాకు వెల్లడించారు. కిర్లంపూడిలో మాట్లాడిన ఆయన ప్రస్తుత బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు ఇస్తామన్న రూ. 1000 కోట్ల మొత్తం చాలదని అన్నారు. భవిష్యత్ ప్రణాళిక ఏంటన్నది త్వరలోనే కాపు సోదరులతో చర్చించి వెల్లడిస్తానని తెలిపారు. మరో పది రోజుల్లో ఒక్కో జిల్లా నుంచి పది మందిని పిలిచి చర్చిస్తానని అన్నారు. తొందరపడకుండా లక్ష్యాన్ని చేరే దిశగా తాను నిద్రపోకుండా, చంద్రబాబును నిద్రపోనీయకుండా చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఎంతవరకూ దిగొచ్చిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చర్చిస్తామని తెలిపారు.