: రూ.16,250 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఏపీ అసెంబ్లీలో 2016-17 వ్యవసాయబడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొద్ది నిమిషాల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ రూ.16,250 కోట్లుగా ఆయన ప్రకటించారు. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభసాటిగా మార్చడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రికార్డు సమయంలో పట్టిసీమ పూర్తి చేశామని అన్నారు. మత్స్యశాఖలో 32.6 శాతం వృద్ధి రేటు, ఉద్యానవన శాఖలో 9.9 శాతం వృద్ధి సాధించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ లో ముఖ్యాంశాల విషయాని కొస్తే.. పశుగ్రాస భద్రతా విధానం తీసుకొస్తామని, లక్ష హెక్టార్లలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామని, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేస్తామని, ఉపాధి హామీ పథకంతో పంట కుంటల తవ్వకం మొదలైన అంశాల గురించి మంత్రి మాట్లాడారు. కాగా, వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.