: సొంత సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన సొంత సినిమా తొలి పోస్టర్ ను సామాజిక మాధ్యమం వేదికగా ఆవిష్కరించారు. హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన సంగీతం, కథను అందించారు. ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ వైఎం మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పేరు '99 సాంగ్స్'గా ప్రకటించారు. ఈ సందర్భంగా 'మీ అందరి ఆశీస్సులు, మద్దతు కావాల'ని రెహమాన్ అన్నారు. 'నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పోస్టర్ ను మీతో పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంద'ని ఆయన చెబుతూ ఆ పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.