: జైలుకైనా వెళతా కానీ, జరిమానా మాత్రం కట్టను: శ్రీశ్రీ రవిశంకర్


జైలుకైనా వెళ్తా కానీ జరిమానా మాత్రం కట్టనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' నిపుణులు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో సంస్కృతి ఉత్సవాల నిర్వహణ పేరిట యమునా నదీతీరంలో గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపిస్తూ ఆయనకు ఐదు కోట్ల రూపాయల ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని ఉత్సవాలు ప్రారంభం నాటికి ముందే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై రవిశంకర్ మాట్లాడుతూ, తామేమీ తప్పు చేయలేదని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాము కానీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా లేమని అన్నారు. రేపు సంస్కృతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆయన తాజా వ్యాఖ్యలపై గ్రీన్ ట్రైబ్యునల్ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్ తిచూపుతున్నారు.

  • Loading...

More Telugu News