: ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకువచ్చారు. 2016-17 ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు... * ఇది తొలి ఈ-బడ్జెట్ * ఎక్కడైనా, ఎప్పుడైనా సులువుగా చదువుకునే అవకాశం. * పూర్తి పారదర్శకంగా తయారు చేశాం. * అన్ని మంత్రిత్వశాఖల అభిప్రాయాలనూ తీసుకున్నాం. * రాష్ట్రాభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ లు. * నదుల అనుసంధానానికి పెద్దపీట. * వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యం. * రూ. 1.35,688 కోట్లతో ఏపీ బడ్జెట్. * ప్రణాళికేతర వ్యయం రూ. 86,554.55 కోట్లు. * ప్రణాళికా వ్యయం రూ. 49,134.44 కోట్లు. * ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు. * వ్యవసాయం వృద్ధి 8.4 శాతం. * సేవారంగంలో మెరుగైన 11.39 శాతం వృద్ధి. * పారిశ్రామిక రంగంలో 11.43 శాతం వృద్ధి. * శాంతి భద్రతలకు రూ. 4,785.14 కోట్లు. * భూ పరిపాలనకు రూ. 3,119 కోట్లు. * పారిశుద్ధ్యానికి రూ. 320 కోట్లు. * నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ. 1,500 కోట్లు. * ఉపాధి హామీకి రూ. 4,764.71 కోట్లు. * గ్రామీణాభివృద్ధికి రూ. 4,467 కోట్లు. * స్మార్ట్ విలేజ్, వార్డులకు రూ. 3,100 కోట్లు. * క్రీడారంగానికి రూ. 215 కోట్లు. * ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 377 కోట్లు. * వివిధ వర్గాల ప్రజల పెన్షన్ లకు రూ. 2,998 కోట్లు. * పట్టణ పరిపాలనకు రూ. 4,728.95 కోట్లు. * యువత సాధికారతకు రూ. 252 కోట్లు. * కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు. * బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 65 కోట్లు. * రుణ మాఫీకి రూ. 3,512 కోట్లు. * మహిళా సాధికారతకు రూ. 642 కోట్లు. * మైనారిటీల సంక్షేమానికి రూ. 710 కోట్లు. * బీసీల సంక్షేమానికి రూ. 8,832 కోట్లు. * ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు. * ఎస్సీల సంక్షేమానికి రూ. 8,724 కోట్లు. * ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 2,702 కోట్లు. * మధ్యాహ్న భోజనానికి రూ. 750 కోట్లు. * గృహ నిర్మాణ రంగానికి రూ. 1,132 కోట్లు. * ఇంధన భద్రతకు రూ. 4,020 కోట్లు. * ఉన్నత విద్యా రంగానికి రూ. 2,642 కోట్లు. * ప్రాథమిక విద్యకు రూ. 17,502 కోట్లు. * ఉద్యానవనాలకు రూ. 659 కోట్లు. * కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు. * పర్యాటక రంగానికి రూ. 227 కోట్లు. * వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 2,933 కోట్లు. * నీటి పారుదల రంగానికి రూ. 7,325 కోట్లు. * పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,660 కోట్లు. * వ్యవసాయ అభివృద్ధికి రూ. 5,838.65 కోట్లు. * దుర్భిక్ష నివారణకు రూ. 50 కోట్లు. * ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి రూ. 360 కోట్లు. * చేనేత రంగానికి రూ. 127 కోట్లు. * మైనింగ్ శాఖ రాబడి అంచనా రూ. 1,635 కోట్లు. * ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు. * పశుసంవర్థక శాఖకు రూ. 819 కోట్లు. * మత్స్య శాఖకు రూ. 339 కోట్లు. * 12 జిల్లాల్లో 432 వాటర్ షెడ్ ప్రాజెక్టులు. * వీటితో 18.18 లక్షల హెక్టార్లకు సాగు నీరు. * పట్టు పరిశ్రమకు రూ. 147 కోట్లు. * రహదారుల అభివృద్ధికి రూ. 3,184 కోట్లు. * ఎన్టీఆర్ జలశ్రీ ఫేజ్-1తో ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు. * 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం. * రూ. 385.55 కోట్ల అంచనా వ్యయంతో పనులు. * గ్రామీణ నీటి సరఫరాకు రూ. 1,195 కోట్లు. * ఫైబర్ గ్రిడ్ కు రూ. 321 కోట్లు. * పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు. * ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు. * 21 రోజుల అనుమతుల కాలాన్ని 14 రోజులకు కుదింపు. * మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట. * చంద్రబాబునాయుడి నాయకత్వ లక్షణాలే రాష్ట్రానికి బలం.