: కోల్ కతా రోడ్లపై ధోనీ డాటర్ షికారు!... సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ఇటీవలే ఏడాది వయసు పూర్తి చేసుకుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం ధోనీ ఆస్ట్రేలియాలో ఉండగా, అతడి భార్య సాక్షి సింగ్ ధోనీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీని ముగించుకుని కూతురు వద్దకు వచ్చిన ధోనీ ఆ ముద్దులొలికే పాపకు ‘జివా’ అనే పేరు పెట్టుకుని తన ప్యాన్స్ కోసం పాప ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి జివా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జివాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టయ్యే ప్రతి ఫొటో వైరల్ గానే మారుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో తల్లి సాక్షి సింగ్ తో కలిసి జివా చక్కర్లు కొట్టింది. సదరు అవుటింగ్ సందర్భంగా తీసుకున్న పొటోలను సాక్షి సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఏడాది వయసులో ముద్దులొలుకుతున్న జివా సదరు ఫొటోల్లో అందరి దృష్టిని ఆకర్షించింది.