: ఇది ఈ-బడ్జెట్... ఎమ్మెల్యేలకు ట్యాబ్ లు పంచిన యనమల!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వినూత్న రీతిలో అసెంబ్లీ ముందుంచారు. అందివచ్చిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. సభ్యులందరికీ ట్యాబ్ లను పంచారు. తాను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో బడ్జెట్ ను తయారు చేశానని, సభ్యులు ఎవరికి నచ్చిన భాషలో వారు చూసుకోవచ్చని తెలిపారు. బడ్జెట్ ప్రతులను సైతం అందరికీ ఇచ్చామని వివరించారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం చెప్పిన కోట్ తో యనమల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన బడ్జెట్ ను తొలి ఈ-బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రస్తుతం ఆయన ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News