: ఆంధ్రప్రదేశ్ 'పెట్రోహబ్'గా తయారవుతుంది: హరిబాబు


ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తరిగిపోని పెట్రో నిల్వలున్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన విద్యాసంస్థల ఏర్పాటుపై మంత్రి గంటా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ పెట్రోహబ్ గా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి కేంద్రం చట్టం చేయాలని, దీనిపై కేంద్ర మానవవనరుల శాఖ మంత్రితో గంటా చర్చించారని ఆయన చెప్పారు. మంత్రి గంటా చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రులంతా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News