: పాక్ జట్టు వస్తే... ఈడెన్ గార్డెన్ పిచ్ తవ్వేస్తామంటున్న ఏటీఎఫ్ఐ!


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచే హైలెట్. ఈ మ్యాచ్ పై నిన్నటి దాకా కమ్ముకున్న అనుమానపు మేఘాలు దాదాపుగా తొలగిపోయాయన్న క్రికెట్ లవర్స్ సంతోషంపై యాంటీ టెర్రిరస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఏటీఎఫ్ఐ) తాజా హెచ్చరికలు నీళ్లు చల్లాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టేందుకు అంగీకరించబోమన్న సదరు సంస్థ, అదే జరిగితే ఈడెన్ గార్డెన్ పిచ్ ను తవ్వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ నేఫథ్యంలో మరోమారు ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్ సన్ పరిస్థితిని సమీక్షిస్తున్నామని నిన్న రాత్రి తెలిపారు. మెగా ఈవెంట్ లో పాల్గొంటున్న జట్ల భద్రత తమ బాధ్యతేనని చెప్పిన ఆయన పోలీసులతో చర్చించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News