: ఐటీ అధికారులమంటూ వచ్చి, అంబికా జ్యూయలర్స్ లో దోపిడీ


దోపిడీ దొంగలు 'వైట్ కాలర్' దారి పట్టారు. ఈ తెల్లవారుఝామున చిత్తూరు జిల్లా నాగులాపురంలో ఐటీ అధికారుల వేషంలో ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడి దోపిడీ చేశారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆదాయపు పన్ను వివరాలు కావాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంబికా జ్యూయలర్స్ లోకి ప్రవేశించారు. యజమాని వివరాలు చెప్పేలోపునే ఆయన్ను కత్తులతో బెదిరించి కుర్చీకి కట్టేశారు. రూ. 7 లక్షల విలువైన నగలు, రూ. 5 వేలు అపహరించి పారిపోయారు. ఈ ఉదయం యజమాని బిగ్గరగా కేకలు పెడుతుంటే, స్థానికులు చూసి విడిపించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News