: చంద్రబాబు సర్కారుపై వైసీపీ అవిశ్వాస తీర్మానం... అసెంబ్లీ కార్యదర్శికి చేరిన నోటీసు


అనుకున్నంతా అయ్యింది. ఓటమి తప్పదని తెలిసినా... ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ ముందుగా నిర్ణయించుకున్న మేరకే ముందుకెళ్లేందుకు మొగ్గు చూపింది. టీడీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రాంగణంలోని అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు... చంద్రబాబు సర్కారుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ కార్యదర్శికి నోటీసు అందజేశారు. దీనిపై నేటి అసెంబ్లీ సమావేశంలో పెద్ద దుమారమే రేగనుంది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా వైసీపీ ముందడుగు వేసేందుకు నిర్ణయించుకోవడంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతేకాకుండా నేటి అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకునే పరిణామాలపైనా సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News