: అక్రమ మద్యం తయారు చేస్తే శిక్ష తప్పదు: బీహార్ సీఎం
బీహార్‌లో వచ్చే నెల 1 నుంచి మద్య నిషేధాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అక్రమంగా మద్యం తయారు చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు. సారా తయారు చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన బుధవారం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్లు చెప్పారు. మద్యం వ్యాపారంలో ఉన్న వారు తమ జీవనోపాధి కోసం తమ దుకాణాలలో సుధా డెయిరీ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆయన సూచించారు.