: మందుబాబుల ముందు అనుకోని అతిథి... బారులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన దున్న‌పోతు!


దక్షిణాఫ్రికా తూర్పు కేప్‌టౌన్‌లోని హ్లోసీ గేమ్ బారులో మందుబాబులంద‌రూ తాగి మ‌జా చేసుకుంటున్న స‌మ‌యంలో ఓ దున్న‌పోతు ఎంట్రీ ఇచ్చింది. ఇక వారంద‌రూ మందు, చిందు మానేసి దున్న‌పోతుని చూసి కళ్లప్పగించారు. లాడ్జి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఈ అడవి జంతువు అక్క‌డి స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగి, తర్వాత చిన్న దారి గుండా బార్ లోకి ప్రవేశించింది. అది మెల్లిగా నడుచుకుంటూ వచ్చి బార్ మధ్యలో నిలుచుంది. కొద్దిసేపు చుట్టూ పరిసరాలను పరిశీలించింది. దాంతో, మందుబాబులంద‌రూ బారులోకి వ‌చ్చిన‌ ప‌నిని మ‌రిచి, ఆసక్తిగా ఆ దున్న‌పోతుని చూస్తుండిపోయారు. కాసేపటికి సిబ్బంది దానిని జాగ్రత్తగా బయటకు పంపించేశారు. దున్న‌పోతు ఎటువంటి నష్టం చేయ‌లేదంటూ... ఈ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాన్ని సిబ్బంది సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. బార్ మధ్యలో నిలుచున్న దున్నపోతు ఫొటోను లాడ్జి సిబ్బంది క్యాప్షన్ తో పాటుగా ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News