: 'రాజధాని భూములపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి' అనే నినాదాలతో హోరెత్తిన సభ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నినాదాలతో హోరెత్తింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అధికార పక్షంపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై వాడీవేడిగా చర్చ జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో శాసనసభ దద్దరిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ పలు సందర్భాల్లో భావోద్వేగానికి గురికాగా, మరికొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూములపై చర్చ ముగుస్తుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల ప్రకటించడంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. 'రాజధాని భూములపై సీబీఐ ఎంక్వయిరీ వేయా'లంటూ సభ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. దీంతో అధికారపక్షం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.