: గిన్నిస్ రికార్డుకెక్కిన సోనాక్షి సిన్హా


వందలాది మంది విద్యార్థినులతో కలిసి ఏకకాలంలో గోళ్లకు రంగు వేసుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గిన్నిస్ రికార్డుకెక్కింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలాండ్ కు చెందిన కాస్మోటిక్ బ్రాండ్ ఇంగ్లోట్, సోనాక్షి సిన్హా సంయుక్తంగా ముంబయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది విద్యార్థినులతో కలిసి ఈ విధంగా గోళ్లకు రంగు వేసుకోవడం అరుదైన సంఘటనగా గుర్తించడంతో సోనాక్షి సిన్హా గిన్నిస్ రికార్డుకెక్కింది.

  • Loading...

More Telugu News