: నిందితుడివి నువ్వే... ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశావు, నువ్వు విచారించేదేంటి?: నిప్పులు చెరిగిన జగన్
తాను చంద్రబాబును ఒకే మాట అడిగానని, అది కూడా చాలెంజ్ చేసి మరీ చెప్పానని, అమరావతిలో భూదందాపై సీబీఐ చేత విచారణ జరిపిద్దామని చెబితే, అందుకు అంగీకరించకుండా సభలో విచారణ చేద్దామని చెప్పడం ఏంటని జగన్ నిప్పులు చెరిగారు. "మీరు కేంద్రంలో భాగంగా ఉన్నా, సీబీఐని మీరు మేనేజ్ చేసుకుంటారన్న భయం నాకు కాస్తో కూస్తే ఉన్నా, ధైర్యం చేసి అడుగుతా ఉన్నా... సీబీఐ చేత ఎంక్వైరీ చేయిద్దామని. రెడీనా? అసలు నాకు ఆర్థం కాక అడుగుతావున్నా... ఫలానా చోట రాజధాని వస్తుందన్న సంగతి నీకు తెలిసివుండి, నువ్వు నాగార్జున యూనివర్శిటీ దగ్గర, ఇంకొక చోట, ఇంకొక చోట రాజధాని వస్తుందన్న భ్రమలు కల్పించి, నీ బినామీల చేత ఇక్కడ పూర్తిగా భూములు కొనిపించిన తరువాత, రాజధాని ఇక్కడ వస్తుందని డిక్లేర్ చేశావు. ఇది రైతులను మోసం చేయడం కాదా? అని అడుగుతావున్నా నేను" అన్నారు. ఆపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "మీరు యాక్షన్ తీసుకోవడం ఏంటండీ? అసలు నిందితుడివి నువ్వే. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది నువ్వే. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. ఓత్ ఆఫ్ సీక్రెసీ... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు... ఫలానా చోట ఫలానా వస్తుందని తెలిసి, దాని వల్ల మీకు సంబంధించిన వాళ్లకు... మీకు లాభం చేకూర్చేందుకు... నువ్వు... నువ్వు... వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదన్నదే ఓత్ ఆఫ్ సీక్రెసీ. దీన్ని మీరు మీరారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకే వస్తుంది" అని జగన్ ఆవేశంగా ప్రసంగించారు.