: ఎంత చెప్పినా కుర్రవాడికి జ్ఞానోదయం కావట్లా: గోరంట్ల


నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూముల్లో జరిగినట్టు సాక్షి మీడియా చెబుతున్న భూ బాగోతంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. దీనిపై మాట్లాడిన టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి జగన్ పై విరుచుకుపడ్డారు. "అధ్యక్షా... మన సభకి కొన్ని రూల్స్, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మా దురదృష్టం ఏంటంటే, ఈ కుర్రవాడికి జ్ఞానోదయం కావట్లా... రెండేళ్ల నుంచి ఉన్నాడు. ఈ కుర్రాడికి జ్ఞానోదయం కాలా..." అంటుండగానే మైకును కట్ చేసిన స్పీకర్ కోడెల, 'మీరు సీనియర్ మెంబర్, మాట్లాడే విధానం సరిగ్గా ఉండాల'ని హితవు పలికారు. ఆపై గోరంట్ల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తమపై చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన అవసరం జగన్ పై ఉందని అన్నారు. పత్రికల్లో రాతలు వేరు, సభలో ఆరోపించడం వేరని, దానికి కట్టుబడి ఉన్నారా? లేదా? కట్టుబడకుంటే క్షమాపణ చెప్పాలని, కట్టుబడితే నిరూపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News