: ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇదే రిపీటవుద్ది: ఎంపీ కవిత


తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని మినహా తప్ప పార్టీనీ ప్రజలు నమ్మడం లేదన్న విషయం మరోసారి స్పష్టమైందని నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఖమ్మం, వరంగల్, అచ్చంపేట ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు అభినందిస్తున్నారని, దాని ఫలితాలే ఓట్ల రూపంలో వస్తున్నాయని అన్నారు. ఇకపై తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తరహా ఫలితాలే పునరావృతమవుతాయని, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను తాము ఏడాదిన్నర వ్యవధిలో చేసి చూపామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను విమర్శిస్తే, ఎవరికీ ఓట్లు పడవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News