: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ప్రశ్నాపత్రాల లీక్... సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం!
నేడు జరుగుతున్న ఇంటర్ మ్యాథమేటిక్స్ - ఏ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తెలిసింది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరీక్ష జరుగుతుండగానే ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో కనిపించిందని సమాచారం. కొన్ని ప్రైవేటు కాలేజీలకు చెందిన అధ్యాపకులు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి బయటకు పంపగా, వాటికి సమాధానాలు తయారు చేసి విద్యార్థులకు పంచుతున్నారని బోర్డు అధికారులకు తెలిసింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. మరోవైపు నేటి ఉదయం 8 గంటల సమయంలో మ్యాథ్స్ తో పాటు సివిక్స్ ప్రశ్నాపత్రాలు నెల్లూరు జిల్లా రాపూరులోని ఓ ఎగ్జామ్ సెంటర్ నుంచి బయట పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్థానిక పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందగా, పోలీసులు విచారిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీక్ పై మరింత సమాచారం వెలువడాల్సివుంది.