: ఇలా డంబాలు పలికితే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది?: చంద్రబాబుకు జగన్ ప్రశ్న


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్న గొప్పల కారణంగానే కేంద్రం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని జగన్ దుయ్యబట్టారు. విశాఖపట్నం కేంద్రంగా సదస్సును పెట్టి ఏడుగురు కేంద్ర మంత్రులను పిలిపించి, రూ. 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని గొప్పలు చెప్పుకున్నారని, సింగపూర్, మలేషియా, జపాన్, చైనా, దావోస్ తదితర ప్రాంతాల్లో పర్యటనలు జరిపి, అక్కడి నుంచి వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్స్ వస్తున్నాయని డంబాలు పలికారని ఆరోపించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటే, ప్రత్యేక హోదా ఎలా వస్తుందని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తున్న రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ ఎందుకని కేంద్రం అనుకోదా? అని అడిగారు. చంద్రబాబు అసలింతవరకూ ఎన్ని వేల కోట్లను పెట్టుబడిగా తీసుకొచ్చారో చెప్పాలని చంద్రబాబును గట్టిగా అడుగుతున్నట్టు తెలిపారు. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలా పనిచేసిందనడానికి కొలబద్దగా, ప్రభుత్వ జీడీపీ ప్రామాణికమని గుర్తు చేశారు. జీడీపీ వృద్ధి నమోదు కాకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News