: తాజా మునిసి‘పోల్స్’లో ఎవరికెన్ని సీట్లంటే..?


కొత్త రాష్ట్రం తెలంగాణలో రెండో విడతగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీకి ఇటీవలే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నేటి ఉదయం ఆయా ప్రాంతాల్లో ప్రారంభమైన కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ ఫలితాల్లో మూడు చోట్ల టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అచ్చంపేటలోని 20 వార్డుల్లోనూ విజయం సాధించిన ‘గులాబీ’ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ విపక్షాలన్నీ జట్టు కట్టి బరిలోకి దిగినా టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయలేకపోయాయి. ఇక ఖమ్మం కార్పొరేషన్ విషయానికి వస్తే... అక్కడి మొత్తం 50 డివిజన్లలో 34 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ ను అక్కడి ప్రజలు కాస్తంత బాగానే ఆదరించారు. ఆ పార్టీ 10 డివిజన్లలో విజయం సాధించింది. ఇక జగన్ పార్టీ వైసీపీ కూడా రెండు డివిజన్లలో గెలుపొందింది. కమ్యూనిస్టులకు పెట్టని కోటగా పేరుగాంచిన ఖమ్మంలో సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు డివిజన్లు దక్కాయి. ఇక వరంగల్ విషయానికి వస్తే... మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. 4 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ , ఓ స్థానంలో బీజేపీ, మరో స్థానంలో సీపీఎం, 8 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

  • Loading...

More Telugu News