: ఖమ్మంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్... ఖాతా తెరిచిన వైకాపా!
తెలంగాణ ప్రాంతంలో వైకాపాకు కాస్తో, కూస్తో పట్టున్న ప్రాంతంగా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతాను తెరిచింది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మొత్తం 50 స్థానాలకు గాను 12 స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. 4వ డివిజన్ లో వైకాపా అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ 10 డివిజన్లలో గెలుపొంది విజయం దిశగా దూసుకుపోతుండగా, కాంగ్రెస్ కు 1 డివిజన్ దక్కింది. మిగతా 38 స్థానాల్లో ఫలితాలు మరో మూడు గంటల్లో వెలువడనున్నాయి.