: సంఘ్వీ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీ!


దేశంలోని ఇద్దరు ప్రముఖులు చేతులు కలిపారు. వారెవరంటే... వ్యాపార విపణిలో భారత్ లోనే అపర కుబేరుడిగా ఎదిగిన సన్ ఫార్మా అధినేత దిలీప్ ఎస్. సంఘ్వీ, క్రికెట్ క్రీడా ప్రపంచంలో తన అసమాన ప్రతిభా పాటవాలతో టీమిండియాకు లెక్కలేనన్ని విజయాలు చేకూర్చిన మహేంద్ర సింగ్ ధోనీ. వీరు చేతులెందుకు కలిపారంటే... ‘రీవైటల్’ మందులకు దక్షిణాదిలో ‘జీవం’ నింపేందుకేనట! ఉత్తర భారతంలోనే కాక ఈస్ట్, సెంట్రల్ ఇండియాలోనూ సన్ ఫార్మా ఉత్పత్తి రీవైటల్ కు మంచి మార్కెట్టే ఉంది. ఇక దక్షిణాదితో పాటు పశ్చిమ భారతంలోనూ సత్తా చాటేందుకు రీవైటల్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం రీవైటల్ మార్కెట్ ను విస్తృతం చేసుకునేందుకు సన్ ఫార్మా... మహీని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఈ మేరకు నిన్న మహీ, సన్ ఫార్మా మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

  • Loading...

More Telugu News