: దీదీ ఎన్నికల ప్రచారం షురూ
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం షురూ అయింది. సీపీఐ(ఎమ్), కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించాలంటూ ఆమె శంఖారావం మోగించారు. చివరి సారిగా జరిగిన ఎన్నికల్లోనూ మహిళా దినోత్సవం రోజునే ప్రచారం ప్రారంభించామని, ఈసారీ అదే జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కోల్‌కతా వీధులన్నీ తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరగునున్నాయి.