: టీ20 వరల్డ్ కప్ గెలుచుకునే అన్ని అర్హతలు ఉన్న జట్టు టీమిండియా: ధోనీ
టీ20 వరల్డ్ కప్ గెలుచుకునే అన్ని అర్హతలు ఉన్న ఏకైక జట్టు టీమిండియా అని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ ప్రారంభమైన నేపథ్యంలో ధోనీ ముంబైలో మాట్లాడుతూ, టీమిండియాకు వరల్డ్ కప్ గెలుచుకునే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. 2011 వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు టీమిండియా ఎంత పటిష్ఠంగా ఉందో ఇప్పుడు కూడా అంతే పటిష్ఠంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. దానికి తోడు టీమిండియా మంచి ఫాంలో ఉందని తెలిపాడు. టీ20 ల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని పేర్కొన్న ధోనీ, తాము మాత్రం అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల అంచనాలు అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. స్వదేశంలో ఆడనుండడం టీమిండియాకు కలిసివచ్చే అంశమని అన్నాడు. భారత్ లో టోర్నీ గెలుచుకుంటే లభించే మజాను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామని ధోనీ చెప్పాడు. అతి విశ్వాసం లేదని, అందరూ ఒత్తిడిని జయించేందుకు సిద్ధంగా ఉన్నారని ధోనీ తెలిపాడు.