: రావెల సుశీల్ కు రెండు రోజుల పోలీస్ కస్టడీ


హైదరాబాదులో ప్రైవేటు పాఠశాల మహిళాటీచర్ ను వెంబడించి, వేధించిన ఘటనలో నిర్భయ కేసులో జైలు పాలైన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ను న్యాయస్థానం రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందంటూ తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, రావెల సుశీల్ ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే న్యాయవాది సమక్షంలో అతనిని విచారించాలనే షరతు విధించడం విశేషం.

  • Loading...

More Telugu News