: హైటెక్ రాడార్‌తో షేక్స్పియర్ సమాధి స్కాన్
యూకేలో స్ట్రాట్ఫోర్డ్ లోని హోలీ ట్రినిటి చర్చిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ నాటక రచయిత విలియం షేక్స్పియర్ సమాధిని హైటెక్ రాడార్‌ని ఉపయోగించి స్కాన్ చేశారు. బయటికి రాని ఆయన మరణ రహస్యాల్ని ఛేదించడానికి తాజాగా ఈ ప్రయోగం చేశారు. ఆయన 400వ వర్ధంతి సందర్భంగా ఈ పరిశీలన జరుపుతున్నారు. హైటెక్ రాడార్‌ని సాధారణంగా.. గతంలో గుర్తించని సమాధుల్లో ఉపయోగించి, మరణించిన వారి కొలతలు, ఆకారం వంటి విషయాలు తెలుసుకుంటారు. చర్చిలో ఉన్న షేక్స్పియర్ సమాధిని స్కాన్ చేయడం పూర్తయిందని, అక్కడ ఇటువంటి పరిశోధనలు జరపాలంటే అనుమతి తప్పక ఉండాలని చర్చి అధికారులు తెలిపారు. అయితే ఈ అధ్యయనం ఇంకా కొనసాగనుంది. మెడైవల్లోని షేక్స్పియర్ ఇంటి వద్ద తమ పరిశోధనలు చేయనున్నారు. తమ అధ్యయన ఫలితాలు ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న వరల్డ్ షేక్స్పియర్ కాంగ్రెస్ లో వెల్లడిస్తామని పరిశోధకులు తెలిపారు.