: సూరత్ లో నడిరోడ్డుపై మహిళల సిగపట్లు...'వుమెన్స్ డే స్పెషల్' అంటూ కామెంట్లు


గుజరాత్ లోని సూరత్ లో ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై ఎడాపెడా కొట్టేసుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని సిగపట్లు పడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ బండబూతులు తిట్టుకున్నారు. వారిని ఆపేందుకు వచ్చిన మగవాళ్లను తోసేసి మరీ తన్నుకున్నారు. ఈ ఘట్టం మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి, 'వుమెన్స్ డే స్పెషల్' అంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ సిగపట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇంతకీ, ఈ గొడవకు కారణం తెలుసుకుంటే ఇంతేనా? అని ఆశ్చర్యపోతారు. ముందు కార్లో వెళ్తున్న మహిళ, వెనుక కార్లో వస్తున్న మహిళకు సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె ముందుకు దూసుకువచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరూ కార్లలోంచి దిగి తిట్టుకున్నారు. తరువాత నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సిగపట్లు పట్టారు.

  • Loading...

More Telugu News