: రాజీవ్ హంతకురాలు నళినికి మరోసారి పెరోల్


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న నళినికి మరోమారు పెరోల్ లభించింది. ఇటీవలే నళిని తండ్రి మరణించిన నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమెకు ఒకరోజు పెరోల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు, తాజాగా మరోమారు ఆమెకు పెరోల్ మంజూరు చేసింది. తండ్రి కర్మకాండలకు హాజరయ్యేందుకు ఓ రోజు పెరోల్ మంజూరు చేయాలన్న నళిని పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News