: అధ్యక్షా... నలుగురితో తిట్టిస్తున్నారు, పోనీలే.. పైన దేవుడున్నాడు: జగన్


ఏపీ అసెంబ్లీలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన చర్చ వాడివేడిగా సాగుతూ, వ్యక్తిగత ఆరోపణల వైపు మళ్లింది. వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రసంగిస్తూ, రోజా సస్పెన్షన్, రిషితేశ్వరి ఘటన, ఇసుక అక్రమాల్లో మహిళా ఎమ్మార్వోను కొట్టిన సంగతి, డ్వాక్రా సంఘాలపై పోలీసుల దాడి, మంత్రి రావెల తనయుడి కేసు తదితర విషయాలను ప్రస్తావించారు. దీనిపై అభ్యంతరం చెప్పిన అధికార పక్షం, జగన్ ప్రసంగాన్ని అడ్డుకుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల తదితరులు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆపై తిరిగి మైకును జగన్ కు ఇవ్వగా, "అధ్యక్షా... నా నుంచి మైకును తీసుకుని నలుగురితో తిట్టిస్తున్నారు. తిరిగి మైకు ఇస్తున్నారు. పోనీలే పైన దేవుడున్నాడు" అని వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అప్పుడు కూడా జగన్ ప్రసంగం మధ్యలో మైకును కట్ చేసిన స్పీకర్ అధికార పక్షానికి అవకాశం ఇచ్చారు.

  • Loading...

More Telugu News