: మెల్డోనియం ఏంటి?... షరపోవా ఎందుకు తీసుకుంది?


ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలకు ముందు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో టెన్నిస్ తార మారియా షరపోవా విఫలమై, తన జీవితంలోనే అతిపెద్ద అపవాదును మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వాడిన మెల్డోనియం గురించిన కొన్ని వివరాలు... ఈ ఔషధాన్ని గుండె జబ్బులున్న వారికి వాడతారు. దీనివల్ల బాధితుల గుండెకు రక్త ప్రసరణ మరింత సులభతరమవుతుంది. దీంతో శారీరకంగా, మానసికంగా మరింత బలంగా ఉన్న భావన వారికి కలుగుతుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో శక్తి నశిస్తున్నా కూడా, తాత్కాలిక ఓపిక పెరుగుతుందన్న కారణంతో ఆటగాళ్లు దీన్ని వాడకుండా నిషేధం విధించారు. ఇక తనకున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు గడచిన పదేళ్లుగా మెల్డోనియంను షరపోవా వాడుతోంది. అయితే, 2016 సీజన్ నుంచి దీన్ని నిషేధిస్తున్నామని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ) నుంచి అందరు ఆటగాళ్లకు లాగానే షరపోవాకూ ఈ-మెయిల్ అందింది. అయితే, ఆమె దాన్ని చదవలేదు. జనవరి 1, 2015 నుంచి మెల్డోనియం వాడకంపై నిషేధం మొదలైంది. ఆపై ఎంతో మంది ఆటగాళ్లు డోపింగ్ పరీక్షల్లో విఫలం అయ్యారు కూడా. 2014 వింటర్ ఒలింపిక్స్ లో ఐస్ డ్యాన్సింగ్ విభాగంలో స్వర్ణ పతక విజేత ఎకతెరినా బొబ్రోవా, సైక్లిస్ట్ వర్గోన్వో, 1,500 మీటర్ రన్నర్ అబేబా అరిగావి తదితరులు డోపింగ్ పరీక్షల్లో విఫలమై, తమ కెరీర్ లను ప్రమాదంలో పడేసుకున్నారు. లాత్వియా కేంద్రంగా పనిచేస్తున్న గ్రిండెక్స్ సంస్థ మెల్టోనియం ఔషధాన్ని 'మెల్డ్రోనేట్' పేరిట మార్కెటింగ్ చేస్తోంది. రష్యా తదితర దేశాల్లో దీని వాడకం సర్వసాధారణం. ఈ సంవత్సరం మొత్తం 8,300 మంది ఆటగాళ్ల యూరిన్ శాంపిల్స్ పరీక్షించగా, 182 మంది మెల్డోనియం వాడుతున్నట్టు వెల్లడైందని యూఎస్ సంస్థ 'పార్టనర్ షిప్ ఫర్ క్లీన్ కాంపిటేషన్' తెలిపింది.

  • Loading...

More Telugu News