: పశ్చిమ బెంగాల్ లో బాంబు పేలుడు!


కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మూడు కంటెయినర్లలో ఉన్న నాటుబాంబులు ఒకేసారి పేలినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగిరం చేశారు. గాయపడిన వారిని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. కేంద్ర బలగాలు సైతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు జరుపుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News