: ధోనీ విషయంలో కోహ్లీ అభిప్రాయాన్ని విభేదించిన గంభీర్
ఓ క్రికెట్ మ్యాచ్ లో విజయ తీరాలకు చేర్చే అద్భుతమైన ఫినిషర్ ఎవరంటే, సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ధోనీ పేరే వినిపిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ, ఆసియా కప్ టీ-20 ఫైనల్ పోరే. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం "ధోనీ ఓ మంచి మ్యాచ్ ఫినిషర్" అని కితాబిచ్చాడు. ఈ విషయంలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం ధోనీ కన్నా, కోహ్లీయే మంచి ఫినిషర్ అని అంటున్నాడు. ధోనీని మించిన ఆటగాడు లేడన్నది మీడియా ముద్రేనని, మ్యాచ్ ని త్వరగా ముగించడంలో కోహ్లీయే బెస్టని అన్నాడు. ప్రపంచమంతా అంగీకరిస్తున్న విషయాన్ని గంభీర్ ఎందుకు కాదన్నాడో మరి!