: రోజాను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేయాలి... రౌడీ షీట్ తెరవాలి: సోమిరెడ్డి డిమాండ్


ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఐదేళ్లకు పెంచాలని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, ఎమ్మెల్యేలను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన రోజాపై రౌడీ షీట్ తెరవాలని కూడా సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలు మహిళలను తలదించుకునేలా చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News