: రేపు సూర్య గ్రహణం... నేటి రాత్రి నుంచి ప్రముఖ ఆలయాలన్నీ మూత
సూర్య గ్రహణ ప్రభావంతో నేటి రాత్రి నుంచి రేపు ఉదయం దాకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడనున్నాయి. రేపు ఉదయం 6.20 గంటలకు మొదలయ్యే సూర్య గ్రహణం 6.45 గంటల దాకా కొనసాగనుంది. ఈ క్రమంలో తిరుమల, బెజవాడ కనకదుర్గ, యాదగిరిగుట్ట, బాసర తదితర ఆలయాలన్నీ నేటి రాత్రి నుంచే మూతపడనున్నాయి. సూర్య గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత తిరిగి ఆలయాలను తెరుస్తారు. ఈ క్రమంలో రేపు ఉదయం ఆయా ఆలయాల్లో పలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.