: అభిమాని అత్యుత్సాహానికి ధోనీ చెప్పిన సరైన సమాధానం అది!


గతంలో వరల్డ్ కప్ సందర్భంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిన తీరు ఆ జట్టు అభిమానులను నిరాశపరిచింది. దీంతో అప్పటి నుంచి భారత్ పై బంగ్లా క్రికెట్ ప్రియులు ద్వేషం పెంచుకున్నారు. అప్పటి నుంచీ భారత జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లినప్పుడల్లా, వారి నుంచి దూషణలు ఎదురవుతున్నాయి. ఓ టోర్నీలో టీమిండియాను ఆ జట్టు ఓడించగలిగింది. దీంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీంతో కొంత మంది అభిమానులు టీమిండియాలోని కీలక ఆటగాళ్లను వరుసగా నిలబెట్టి నరికినట్టు పోస్టర్లు తయారుచేశారు. దీనిపై నిరసన వ్యక్తమైనప్పటికీ వారు పట్టించుకోలేదు. తాజాగా ఆసియా కప్ సందర్భంగా ఇలాంటి అత్యుత్సాహన్ని అక్కడి అభిమానులు ప్రదర్శించారు. ఫైనల్ మ్యాచ్ కు ముందు బంగ్లా కెప్టెన్ ముషారఫ్ మొర్తజా టీమిండియా కెప్టెన్ తలను నరికి తీసుకెళ్తున్నట్టు, ధోనీ తల నుంచి రక్తం కారుతున్నట్టు ఉన్న ఆ ఫోటోషాప్ ఇమేజ్ టీమిండియా అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై తీవ్ర వాదోపవాదాలు జరిగినప్పటికీ ఇది మంచి సంప్రదాయం కాదంటూ భారతీయ అభిమానులు బంగ్లా అభిమానులకు హితవు పలికారు. ఇంకొందరు మరికొంత ముందుకు వెళ్లి భారత్ ముందు బంగ్లా ఎప్పుడూ పసికూనే అని స్పష్టం చేశారు. ఈ ఫోటో ధోనీని కూడా చేరినట్టుంది. ఎందుకంటే, ఫైనల్ లో ధోనీ ఆటను చూస్తే ఈ అనుమానం మనకు రాకమానదు. ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టు 120 పరుగులు చేసింది. 15 ఓవర్లలో 120 పరుగులు అంటే పెద్ద స్కోరే. ప్రారంభంలో రోహిత్ అవుటయ్యాడు. ధావన్, కోహ్లీ జట్టును పోరాటంలోకి తెచ్చినప్పటికీ బంతుల కంటే చేయాల్సిన పరుగులే ఎక్కువ ఉన్నాయి. ఈ దశలో ధావన్ అవుట్ కావడంతో...అప్పుడు రైనా కానీ యువీ కానీ వస్తాడని అంతా భావించారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ...ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. వస్తూనే శివాలెత్తి బ్యాటింగ్ చేశాడు. కేవలం ఆరు బంతుల్లోనే 20 పరుగులు పిండుకుని జట్టుకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించిపెట్టాడు. అంతేకాదు, విన్నింగ్ షాట్ ను భారీ సిక్సర్ గా కొట్టాడు. దీంతో భారతీయ అభిమానులు బంగ్లా అభిమానులకు హితవు పలకడం ప్రారంభించారు. ధోనీ బంగ్లా కెప్టెన్ 'తలనరకడం' ఎలా ఉందని ఇప్పుడు కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News