: నేను షార్ట్ టెంపర్...అందుకే ఇలా కసి తీర్చుకుంటాను: రకుల్ ప్రీత్ సింగ్


టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. నిద్ర లేస్తూనే జిమ్ కి వెళ్లిపోతుందని రకుల్ పై తోటి హీరోయిన్లు రెజీనా కాసాండ్రా, రాశి ఖన్నా జోకులు కూడా వేస్తుంటారు. దీనిపై రకుల్ మాట్లాడుతూ, తన బాడీ మెటబాలిజమ్ సరిగ్గా ఉండదని దానిని బ్యాలెన్స్ చేసేందుకు జిమ్ లో పాట్లు పడుతుంటానని రకుల్ వెల్లడించింది. తనకు త్వరగా కోపం వచ్చేస్తుందని రకుల్ చెప్పింది. అయితే జిమ్ లో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇంతకు ముందు తనకు ఎవరి మీదైతే కోపం వచ్చిందో వారి ముఖాన్ని గుర్తు చేసుకుంటానని, దీంతో కసికసిగా ప్రాక్టీస్ చేస్తానని రకుల్ తెలిపింది. అయితే తనకు వచ్చిన కోపం ఎక్కువ సేపు ఉండదని, తొందరగానే పోతుందని రకుల్ నవ్వుతూ చెప్పింది.

  • Loading...

More Telugu News